Narendra Modi: కాసేపు వాట్సాప్ ఆగిపోతేనే ఆందోళన చెందారు.. బెంగాల్ లో 55 ఏళ్ల నుంచి అభివృద్ధి ఆగిపోయింది: మోదీ

Bengal development stopped since 55 years says Modi
  • కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ అభివృద్ధిని ఆపేశాయి
  • కేంద్ర నిధులు పేదలకు చేరకుండా మమత ప్రభుత్వం అడ్డుకుంటోంది
  • ఓటు బ్యాంకు రాజకీయాలకే మమత ప్రాధాన్యతను ఇస్తున్నారు
నిన్న రాత్రి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ కాసేపు ఆగిపోతేనే అందరూ ఆందోళన చెందారని... అలాంటిది పశ్చిమబెంగాల్ లో గత 50-55 ఏళ్ల నుంచి అభివృద్ధి ఆగిపోయిందని... దీని గురించి ఇంకెంత ఆందోళన చెందాలని ప్రధాని మోదీ అన్నారు. తొలుత కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వామపక్షాలు, అనంతరం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు బెంగాల్ అభివృద్ధిని ఆపేశాయని చెప్పారు.

కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా తమ ఖాతాల్లోకి వేల రూపాయలు ఎందుకు రావడం లేదని రాష్ట్రంలోని పేద రైతులు అడుగుతున్నారని అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా తమకు ఉచిత వైద్య చికిత్స ఎందుకు దక్కడం లేదని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులు పేదలకు చేరకుండా మమత ప్రభుత్వం అడ్డుకుంటోందని అన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే ప్రాధాన్యత నిస్తున్నారని తెలిపారు. ఖరగ్ పూర్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
Narendra Modi
BJP
Mamata Banerjee
TMC

More Telugu News