YS Sharmila: చరిత్రలో జరగని విధంగా ఖమ్మం సభ ఉండాలి: అభిమానులతో షర్మిల

YS Sharmila held meeting with Khammam district leaders and fans
  • ఖమ్మంలో షర్మిల సభ
  • నేడు నేతలు, అభిమానులతో సమావేశమైన షర్మిల
  • తెలంగాణలో దొరల పాలన పోవాలని ఆకాంక్ష
  • రాజన్న పాలన తెచ్చేందుకు వస్తున్నానని ఉద్ఘాటన
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానని చెబుతున్న వైఎస్ షర్మిల ఇవాళ ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. త్వరలో జరగబోయే సభ (పార్టీ ఆవిర్భావ సభ!) చరిత్రలో జరగని విధంగా ఉండాలని నేతలకు, అభిమానులకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణలో దొరల పాలన పోవాలని, రాజన్న రాజ్యం రావాలని ఆకాంక్షించారు. రాజన్న సంక్షేమ పాలన తీసుకువచ్చేందుకే తాను వస్తున్నానని షర్మిల స్పష్టం చేశారు. వైఎస్సార్ రెండు ప్రాంతాలను రెండు కళ్లలా భావించారని అన్నారు. ఖమ్మం సభలో పార్టీ విధివిధానాలను ప్రకటిస్తానని తెలిపారు. తెలంగాణలో సరైన విపక్షం లేదని, అందుకోసమే పార్టీ పెడుతున్నట్టు స్పష్టం చేశారు.
YS Sharmila
Khammam District
Leaders
Telangana

More Telugu News