Somu Veerraju: జగన్ కు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది: సోము వీర్రాజు

Its time to teach a lesson to Jagan says Somu Veerraju
  • వైసీపీ బెదిరింపులకు బీజేపీ భయపడదు
  • దౌర్జన్యాలకు పాల్పడకుండా ఏ ఎన్నికలోనైనా వైసీపీ గెలిచిందా?
  • కొందరు అధికారులు కూడా వైసీపీ కోసం పని చేస్తున్నారు
వైసీపీ నేతల బెదిరింపులకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భయపడరని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. సీఎం జగన్ కు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. వైసీపీ దౌర్జన్యాలను, అరాచకాలను ఎదుర్కోగల ధైర్యం కేవలం బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు. వివిధ ఎన్నికలలో వైసీపీ సాధించిన విజయాల్లో నైతికత లేదని... దౌర్జన్యాలకు పాల్పడకుండా ఏ ఎన్నికలోనైనా వైసీపీ గెలిచిందా? అని ప్రశ్నించారు. ఉపఎన్నికకు సంబంధించి తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ అధికారులపై కూడా ఈ సందర్భంగా సోము వీర్రాజు మండిపడ్డారు. కొందరు అధికారులు వైసీపీ కోసం పని చేస్తున్నారని దుయ్యబట్టారు. తిరుపతి ఉపఎన్నికలో ప్రధాని చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతోనే ముందుకెళ్తామని చెప్పారు. అభివృద్ధే అజెండాగా ముందుకు సాగుతామని... జనసేనతో కలిసి ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. ఉపఎన్నికలో బీజేపీ-జనసేన కూటమి విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
Somu Veerraju
BJP
Jagan
YSRCP
Tirupati LS Bypolls

More Telugu News