Puvvada Ajay Kumar: ఖమ్మం ప్రజలు అన్ని రాజ్యాలు చూశారు: షర్మిల 'రాజన్న రాజ్యం' స్లోగన్ పై మంత్రి పువ్వాడ స్పందన

Puvvada Ajay Kumar responds to YS Sharmila Rajanna Rajyam slogan
  • త్వరలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ
  • తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ నినాదం
  • అన్నీ చూశాకే ప్రజలు కేసీఆర్ వైపు మళ్లారన్న పువ్వాడ
  • కొత్తగా రాజన్న రాజ్యం అవసరంలేదని స్పష్టీకరణ
తెలంగాణలో పార్టీ స్థాపించేందుకు ఉవ్విళ్లూరుతున్న వైఎస్ షర్మిల రాజన్న రాజ్యం స్లోగన్ తో ముందుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఖమ్మం ప్రజలు అన్ని రాజ్యాలు చూసిన తర్వాతే కేసీఆర్ కు పట్టం కట్టారని, ఇక ఎవరి ఉచ్చులో పడరని అన్నారు. ఒకవేళ చిన్నాచితకా నాయకులు ఎవరి ట్రాప్ లోనైనా పడితే అది వాళ్ల ఇష్టం అని పేర్కొన్నారు. షర్మిల మాట్లాడితే చాలు... రాజన్న రాజ్యం తెస్తానంటున్నారని, ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కొత్తగా రాజన్న రాజ్యం అవసరంలేదని స్పష్టం చేశారు.

కొత్త పార్టీకి సన్నాహాలు చేస్తున్న షర్మిల త్వరలోనే ఖమ్మం నుంచే తన రాజకీయ శంఖారావం పూరించనున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని వైఎస్ సన్నిహితులు, అభిమానులతో సమావేశమయ్యారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభ ద్వారానే తన పార్టీ పేరును ఆమె ప్రకటించనున్నారు.
Puvvada Ajay Kumar
YS Sharmila
Rajanna Rajyam
Khammam
Political Party
Telangana

More Telugu News