Tanushree Dutta: పదకొండేళ్ల తర్వాత రీఎంట్రీకి సిద్ధమైన తనుశ్రీ దత్తా

Tanushree re enters into cinema field
  • ఇటీవల బోల్డ్ గా ఫొటోషూట్
  • తాజా ఫొటోలకు అభిమానుల నుంచి స్పందన
  • చివరిగా 'అపార్ట్ మెంట్'లో నటించిన తనుశ్రీ
  • నేడు తనుశ్రీ 37వ పుట్టినరోజు
  • ఎవరూ తోడు లేక ఒంటరిగా ఉన్నానని వెల్లడి
తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ తనుశ్రీ దత్తా పదకొండేళ్ల విరామం తర్వాత సినీ రంగంలో సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్ధమవుతోంది. ఆమె చివరగా అపార్ట్ మెంట్ అనే బాలీవుడ్ చిత్రంలో నటించింది. అయితే రీఎంట్రీకి ఆసక్తి చూపిస్తున్న తనుశ్రీ ఇటీవల లేటెస్ట్ ఫొటోషూట్ లో బోల్డ్ గా కనిపించింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోగా అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కాగా, నేడు తనుశ్రీ దత్తా 37వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె తన అభిప్రాయాలను పంచుకుంది.

తాత్విక ధోరణిలో మాట్లాడిన ఆమె... ఈ ప్రపంచంలో అన్ని అస్థిరమైనవేనని, పరిస్థితులను బట్టి మనుషులు మారిపోతుంటారని వెల్లడించింది. కొన్నిసార్లు కొందరు మనల్ని వదిలేసి వెళ్లిపోతుంటారని తెలిపింది. ఏమీలేని స్థాయి నుంచి ఈ స్థాయిని అందుకున్నానని, అందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొంది. జన్మదిన వేడుకలపై నాకు పెద్దగా ఆసక్తి ఉండదు, కానీ ఈ పుట్టినరోజుకు అందరూ నాతోనే ఉండాలని కోరుకుంటున్నాను... కానీ నాకు తోడుగా ఎవరూ లేరు అని తనుశ్రీ వివరించింది.
Tanushree Dutta
ReEntry
Bollywood
Tollywood

More Telugu News