Vishnu Kumar Raju: 15 ఎకరాల బౌద్ధ భూమిని సినిమా క్లబ్ కు కేటాయించడం దారుణం: విష్ణుకుమార్ రాజు

Vishnukumar Raju fires on AP Govt over Thotlakonda land allocations
  • విశాఖలో సినిమా క్లబ్ నిర్మాణం
  • తొట్లకొండలో 15 ఎకరాల కేటాయింపు
  • అది బౌద్ధుల పవిత్ర స్థలం అని విష్ణుకుమార్ రాజు వెల్లడి
  • సినిమా క్లబ్ కు మరో చోట స్థలం ఇవ్వాలని మనవి   
బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం తొట్లకొండలో ఉన్న 15 ఎకరాల బౌద్ధ భూమిని సినిమా క్లబ్ కు కేటాయించడం దారుణమని పేర్కొన్నారు.

బౌద్ధులకు పరమ పవిత్రమైన ప్రదేశంలో సినిమా క్లబ్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సెంటిమెంట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, కానీ వైసీపీ సర్కారు ఏకపక్ష పోకడలతో ముందుకెళుతోందని విమర్శించారు. తొట్లకొండ భూములపై ఇచ్చిన జీవో నెం.21ను పునఃపరిశీలన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సినిమా క్లబ్ కు మరో ప్రాంతంలో స్థలం కేటాయించాలని స్పష్టంచేశారు.

అంతకుముందు, బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజుకు తొట్లకొండ భూములపై ఓ వినతిపత్రం అందించారు.
Vishnu Kumar Raju
Thotlakonda
Land
Cinema Club
YSRCP
Visakhapatnam

More Telugu News