Dilip Gandhi: కరోనాతో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్ గాంధీ

BJP MP Dilip Gandhi died with corona virus
  • వాజ్‌పేయి హయాంలో మంత్రిగా దిలీప్ గాంధీ
  • ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి 
  • సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి దిలీప్ కుమార్ మన్ సుఖ్ లాల్ గాంధీ (69) కరోనాతో కన్నుమూశారు. ఇటీవల ఆయన వ్యక్తిగత పని నిమిత్తం ఢిల్లీ వెళ్లారు. అక్కడాయనలో కరోనా లక్షణాలు బయటపడగా వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో నిన్న మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఆయన మృతి విషయాన్ని వెల్లడించారు. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో దిలీప్ గాంధీ నౌకాయాన శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లోక్ సభ సభ్యునిగా గతంలో ఆయన ఎన్నికయ్యారు. గాంధీకి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. దిలీప్ గాంధీ మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు.
Dilip Gandhi
BJP
Corona Virus

More Telugu News