Jagapati Babu: సూపర్ స్టార్ సినిమాలో మరోసారి జగపతిబాబు!

Jagapati Babu to play pivotal role in Rajanikanths Annatte
  • సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతిబాబు బిజీ 
  • గతంలో రజనీకాంత్ తో రెండు సినిమాలు
  • 'అన్నాత్తే'లో కీలక పాత్రకు గ్రీన్ సిగ్నల్   
  • సోషల్ మీడియాలో ప్రకటించిన సన్ పిక్చర్స్  
ఒకప్పుడు హీరోగా రాణించిన ప్రముఖ నటుడు జగపతి బాబు.. తన సెకండ్ ఇన్నింగ్స్ లో గత కొన్నాళ్లుగా పవర్ ఫుల్ పాత్రలు పోషిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరుతెచ్చుకుంటున్న సంగతి విదితమే. కొన్ని సినిమాలలో స్టార్ హీరోలకు దీటుగా విలన్ పాత్రలను కూడా ఆయన సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే, సెకండ్ ఇన్నింగ్స్ లో ఖాళీ అన్నది లేకుండా పలు సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న సినిమాలో కూడా కీలక పాత్ర పోషించడానికి జగపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో 'అన్నాత్తే' పేరిట తాజాగా ఓ భారీ చిత్రనిర్మాణం జరుగుతోంది. ఆమధ్య ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో కూడ జరిగింది. ఇందులో జగపతి నటిస్తున్నారు.

ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తాజాగా వెల్లడిస్తూ.. జగపతికి తమ బృందంలోకి స్వాగతం పలికింది. కాగా, ఇందులో ఆయన నెగటివ్ టచ్ తో సాగే పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంచితే, గతంలో రజనీకాంత్ తో కలసి 'కథానాయకుడు', 'లింగా' సినిమాలలో జగపతిబాబు నటించారు.
Jagapati Babu
Rajanikanth
Shiva
Sun Pictures

More Telugu News