Virat Kohli: కేఎల్‌ రాహుల్ ఆట‌ తీరుపై స్పందించిన‌ కెప్టెన్ విరాట్ కోహ్లీ!

kohli backs rahul
  • స‌మ‌ర్థిస్తూ మాట్లాడిన‌ కోహ్లీ
  • రెండు రోజుల క్రితం వరకు నేనూ ఫామ్‌లో లేను
  • జ‌ట్టులో రాహుల్‌ కీలక ఆటగాడు
  • రోహిత్‌తో కలసి రాహుల్‌ ఓపెనింగ్‌ చేస్తాడు
టీమిండియా ఆట‌గాడు కేఎల్‌ రాహుల్ ప్ర‌ద‌ర్శ‌న తీరుపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఇంగ్లండ్‌తో జ‌రుగుతోన్న‌ టీ20 సిరీసులో కేఎల్ రాహుల్ విఫలమవుతున్నప్ప‌టికీ ఆయ‌న‌ను స‌మ‌ర్థిస్తూ కోహ్లీ మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం వరకు తాను కూడా ఫామ్‌లో లేనని చెప్పాడు.

కేఎల్‌ రాహుల్‌ విజేత అని, త‌మ జ‌ట్టులోని కీలక ఆటగాళ్ల‌లో ఒక‌డ‌ని ప్ర‌శంసించాడు. రోహిత్‌తో రాహుల్‌ ఓపెనింగ్‌ చేస్తాడని చెప్పాడు. టీ20ల్లో ఫామ్‌లోకి రావడమనేది ఐదారు బంతుల వ్యవహారమేన‌ని వ్యాఖ్యానించాడు. కాగా, మ్యాచులో జ‌ట్టు స‌భ్యుల ఆట‌తీరు గురించి ఆయ‌న మాట్లాడుతూ.. టీమ్ విజయాలకు ఉపయోగపడని ఇన్నింగ్స్ తో లాభం లేద‌ని తెలిపాడు.

కొత్త బంతితో బ్యాటింగ్‌ చేయడం కష్టమేన‌ని, ఇంగ్లండ్‌ బౌలర్లు స‌మ‌ర్థంగా బౌలింగ్ చేశార‌ని చెప్పాడు. క్రీజులో నిలదొక్కుకొని ప‌రుగులు రాబ‌ట్టి గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరు రాబ‌ట్టాల‌న్న‌దే త‌న ల‌క్ష్య‌మ‌ని తెలిపాడు. నిన్నటి మ్యాచులో రెండో అర్ధభాగంలో త‌మ ఆట‌తీరు ప్ర‌భావ‌వంతంగా లేద‌ని, హార్దిక్ బాగా రాణించాల్సింద‌ని చెప్పాడు. కాగా, నిన్న‌టి మ్యాచులో కేఎల్ రాహుల్ డ‌కౌట్ అయిన సంగతి తెలిసిందే.
Virat Kohli
kl rahul
Cricket
Team India

More Telugu News