కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నాగార్జున
- వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న నాగార్జున
- నిన్న వ్యాక్సిన్ వేయించుకున్నానని ట్విట్టర్ ద్వారా వెల్లడి
- అర్హులైన అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచన
హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ లో ఆయన వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. మరోవైపు నాగార్జున తాజా చిత్రం 'వైల్డ్ డాగ్' సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.