Ram Swaroop Sharma: ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న బీజేపీ ఎంపీ రామ్ స్వ‌రూప్ శ‌ర్మ

BJP MP from Mandi Ram Swaroop Sharma died allegedly by suicide
  • హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మండీ ఎంపీ రామ్ స్వ‌రూప్
  • ఢిల్లీలోని త‌న నివాసంలో ఉరి
  • పోస్టు మార్టం నిమ‌త్తం ఆసుప‌త్రికి మృత‌దేహం
హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మండీ ఎంపీ, బీజేపీ నేత రామ్ స్వ‌రూప్ శ‌ర్మ (62) ఢిల్లీలోని త‌న నివాసంలో మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఆయ‌న త‌న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని ఈ విష‌యాన్ని గుర్తించిన ఓ వ్య‌క్తి త‌మ‌కు ఫోను చేసి చెప్పాడ‌ని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీంతో వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లికి వెళ్లి ఆయ‌న మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నామ‌ని పోలీసులు చెప్పారు.

అక్క‌డ ప‌లు ఆధారాల‌ను సేక‌రించిన పోలీసులు అనంత‌రం... పోస్టుమార్టం నిమిత్తం ఆయ‌న మృత‌దేహాన్ని గోంతీ అపార్ట్‌మెంట్స్ నుంచి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న కేంద్ర స‌హాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ అక్క‌డ‌కు చేరుకుని పోలీసుల‌తో మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు.  రామ్ స్వ‌రూప్ శ‌ర్మ మృతి ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.
Ram Swaroop Sharma
BJP
suicide

More Telugu News