Rajnath Singh: బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో గంగూలీ సిక్సర్లను ప్రస్తావించిన రాజ్‌నాథ్‌ సింగ్‌!

Rajnath singh invokes gangulys name in Election campaign
  • రాష్ట్రంలో జోరుగా సాగుతున్న ప్రచారం
  • గంగూలీ 'సిక్సర్ల'ను సాధిస్తామన్న రాజ్‌నాథ్‌
  • ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా
  • ఇప్పుడు సిక్స్‌ కొడతామని వ్యాఖ్య
ప‌శ్చిమ‌ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారం జోరుగా సాగుతోంది. నేడు రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నాపూర్‌లో పర్యటించిన ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాజీ క్రికెటర్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్‌ గంగూలీ ఆటతీరును ప్రస్తావించారు. తద్వారా అక్కడి స్థానికుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గంగూలీ సిక్సర్లలా భాజపా కూడా ఈసారి ఎన్నికల్లో అత్యుత్తమ ఫలితాల్ని రాబడుతుందని వ్యాఖ్యానించారు.

సౌర‌బ్ గంగూలీ క్రీజ్ దాటి ముందుకు వ‌చ్చాడంటే సిక్సర్ కొట్టేవాడ‌ని, తాము కూడా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సిక్సర్లు కొట్ట‌బోతున్నామ‌న్నారు. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం ద్వారా తాము క్రీజ్ దాటి ముందుకు వ‌చ్చామ‌ని, ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సిక్స‌ర్ కొట్టి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయ‌మ‌ని రాజ్‌నాథ్ ధీమా వ్య‌క్తం చేశారు.

ప‌శ్చిమ‌బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ప‌శ్చిమ మిడ్నాపూర్‌లో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఓ బ‌హిరంగ స‌భ‌లో ఓట‌ర్ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. గంగూలీ భాజపాలో చేరనున్నారనే ఊహాగానాలు గతకొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో రాజ్‌నాథ్ సింగ్ ఆయన పేరును ప్ర‌స్తావించడం ప్రాధాన్యం సంత‌రించు‌కుంది.
Rajnath Singh
Sourav Ganguly
BJP
West Bengal

More Telugu News