మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిన యూఏఈ క్రికెటర్లపై ఐసీసీ వేటు
- మహ్మద్ నవీద్, షాయిమాన్ అన్వర్ లపై నిషేధం
- 2019లో టీ10 లీగ్ లో ఫిక్సింగ్
- ఇద్దరిపైనా ఆరోపణలు
- అప్పట్లోనే సస్పెండైన ఆటగాళ్లు
- తాజాగా ఎనిమిదేళ్ల నిషేధం విధించిన ఐసీసీ
మహ్మద్ నవీద్, షాయిమాన్ అన్వర్ భట్ అనే ఈ క్రికెటర్లు 2019లోనే సస్పెన్షన్ కు గురయ్యారు. యూఏఈ జట్టుకు నవీద్ కెప్టెన్ కాగా, అన్వర్ ఓపెనింగ్ బ్యాట్స్ మన్. ఓ టీ10 లీగ్ లో వీరిద్దరూ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు గుర్తించారు. వీరిద్దరి తప్పిదాలు నిరూపితం కావడంతో ఎనిమిదేళ్లు నిషేధం విధిస్తూ ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. వీరిపై నిషేధాలను 2019 నుంచి వర్తించేలా అమలు చేయనున్నారు.