England: మూడో టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లండ్

England won the toss in third match
  • టీమిండియా, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్
  • అహ్మదాబాద్ వేదికగా టీ20 పోరు
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • సిరీస్ లో సమవుజ్జీలుగా ఉన్న భారత్, ఇంగ్లండ్
అహ్మదాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య నేడు మూడో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఇరుజట్లు 1-1తో సమవుజ్జీగా ఉన్నాయి. తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలవగా, రెండో మ్యాచ్ లో భారత్ నెగ్గింది.

కాగా, నేటి మ్యాచ్ కోసం భారత జట్టులో రోహిత్ శర్మకు స్థానం కల్పించారు. కేఎల్ రాహుల్ తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని కెప్టెన్ కోహ్లీ టాస్ అనంతరం వెల్లడించాడు. ఇంగ్లండ్ జట్టులో టామ్ కరన్ స్థానంలో మార్క్ ఉడ్ జట్టులోకి వచ్చాడు.
England
Toss
Team India
3rd T20
Ahmedabad

More Telugu News