Upstox: ఐపీఎల్ అధికారిక భాగస్వామిగా 'అప్ స్టాక్స్'... బీసీసీఐ ప్రకటన

BCCI announced Upstox as official partner for IPL
  • ఐపీఎల్ కు కొత్త భాగస్వామి
  • డిజిటల్ బ్రోకరేజి సంస్థతో ఐపీఎల్ ఒప్పందం
  • పలు సంవత్సరాల పాటు ఒప్పందం అమలు
  • భాగస్వామ్యం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఐపీఎల్ చైర్మన్
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు కొత్త భాగస్వామి వచ్చింది. డిజిటల్ బ్రోకరేజి సంస్థ 'అప్ స్టాక్స్' ఇకపై ఐపీఎల్ కు అధికారిక భాగస్వామిగా వ్యవహరించనుంది. ఈ మేరకు బీసీసీఐ అధీనంలోని ఐపీఎల్ పాలకమండలి ప్రకటన చేసింది. రాబోయే కొన్ని సంవత్సరాల పాటు ఈ భాగస్వామ్యం కొనసాగనుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

దీనిపై ఐపీఎల్ చైర్మన్ బ్రజేశ్ పటేల్ మాట్లాడుతూ, ఐపీఎల్ తో 'అప్ స్టాక్స్' ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 'అప్ స్టాక్స్' ఎంతో వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ ట్రేడింగ్ ప్లాట్ ఫాం అని వెల్లడించారు. 'అప్ స్టాక్స్' తో కలిసి ఐపీఎల్ కూడా మరింతగా విస్తరిస్తుందని భావిస్తున్నామని చెప్పారు.
Upstox
IPL
Partner
BCCI
India

More Telugu News