Stalin: డీఎంకే అధినేత స్టాలిన్ స్థిర, చరాస్తుల వివరాలు!

Stalin declares his assets in poll affidavit
  • స్థిరాస్థులు రూ. 2.24 కోట్లు.. చరాస్తులు రూ. 4.94 కోట్లు
  • సొంత కారు లేదని తెలిపిన స్టాలిన్
  • చేతిలో రూ. 50 వేల నగదు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే అధినేత స్టాలిన్ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో ప్రకటించారు. తనకు రూ. 2.24 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ. 4.94 కోట్ల చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు. స్థిరాస్తులలో వ్యవసాయ భూమి, రెసిడెన్సియల్ భవంతులను చూపించారు. తన చేతిలో రూ. 50 వేల నగదు ఉందని తెలిపారు. మరోవైపు తన భార్య పేరిట రూ. 30,52,854 విలువైన చరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. తన భార్యకు రూ. 24.77 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయని వెల్లడించారు.

ఎమ్మెల్యేగా వస్తున్న జీతం, బ్యాంకు డిపాజిట్లు, అద్దెల ద్వారా తనకు ఆదాయం వస్తోందని స్టాలిన్ చూపించారు. తనకు సొంత కారు లేదని తెలిపారు. బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలకు ఎలాంటి బకాయిలు లేవని పేర్కొన్నారు.

స్టాలిన్ కుమారుడు ఉదయనిధి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈయన కూడా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో ప్రకటించారు. తనకు రూ. 21.13 కోట్ల చరాస్తులు, రూ. 6.54 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు.
Stalin
DMK
Assets

More Telugu News