Mahabubabad District: నెల్లికుదురు ఘర్షణ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ సహా 17మందిపై కేసు

Mahabubabad police file cases against trs and bjp leaders
  • బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి సహా 12 మందిపైనా కేసు
  • రేపటి వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్
  • సభలు, సమావేశాలు, ధర్నాలకు అనుమతి లేదన్న ఎస్పీ
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ఆదివారం టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య జరిగిన గొడవకు సంబంధించి పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తోపాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు 17 మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డితోపాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు 12 మందిపై కేసులు నమోదయ్యాయి. అలాగే, రేపటి వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. జిల్లాలో ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉండడంతో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు అనుమతి లేదని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
Mahabubabad District
Nellikuduru
BJP
Telangana

More Telugu News