Mukhesh: భార్య నోటికి తాళం వేయలేక నాలుక కోసుకున్న భర్త!

Frustrated husband cut his tongue after quarrel with wife
  • ఉత్తరప్రదేశ్ లో ఘటన
  • నిషా, ముఖేశ్ భార్యాభర్తలు
  • ఇటీవలే పుట్టింటికి వెళ్లిన నిషా
  • ఒప్పించి తీసుకువచ్చిన భర్త
  • మళ్లీ గొడవకు దిగిన నిషా
ఉత్తరప్రదేశ్ లో ఓ బాధాకరమైన సంఘటన జరిగింది. గయ్యాళి భార్యతో వాదించలేక ఓ భర్త నాలుక కోసుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. కాన్పూర్ జిల్లా గోపాల్ పూర్ కు చెందిన ముఖేశ్, నిషా దంపతులు. ముఖేశ్ ఓ రైతు. అయితే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఇటీవల కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో నిషా పుట్టింటికి వెళ్లింది. అయితే ఆమెకు నచ్చచెప్పిన ముఖేశ్ మళ్లీ కాపురానికి తీసుకువచ్చాడు.

కానీ ఎప్పట్లాగానే నిషా మరోసారి గొడవకు దిగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిపోయింది. వాగ్యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. నిషా ఎంతకీ తగ్గకపోవడంతో ముఖేశ్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఆమెతో వాదించడం శుద్ధ దండగ అని భావించి ఓ పదునైన వస్తువుతో తన నాలుక కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ముఖేశ్ ను ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Mukhesh
Nisha
Tongue
Gopalpur
Uttar Pradesh

More Telugu News