Andhra Pradesh: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయంటే..!

Party wise vote percentage in AP municipal elections
  • 52.63 శాతం ఓట్లు సాధించిన వైసీపీ
  • టీడీపీకి 30.73 శాతం ఓట్లు
  • 4.67 శాతానికి పరిమితమైన జనసేన
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 73 మున్సిపాలిటీలతో పాటు, మొత్తం 11 కార్పొరేషన్లలో జయకేతనం ఎగురవేసింది. వైసీపీ ప్రభంజనం ముందు ఇతర పార్టీలు నిలవలేకపోయాయి. టీడీపీ కొంత మేర పోటీ ఇచ్చినప్పటికీ... ఇతర పార్టీలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓటింగ్ నమోదయిందనే వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

పార్టీలు, వాటికి పడిన ఓట్ల వివరాలు:
  • వైసీపీ - 52.63 శాతం ఓట్లు
  • టీడీపీ - 30.73 శాతం
  • జనసేన - 4.67 శాతం
  • బీజేపీ - 2.41 శాతం
  • స్వతంత్రులు - 5.73 శాతం
  • నోటా - 1.07 శాతం
Andhra Pradesh
Municipal Elections
Vote Percentage
Telugudesam
YSRCP
BJP
Janasena

More Telugu News