Corona Virus: మహారాష్ట్రలో ఒకేరోజు భారీగా పెరిగిన కరోనా కేసులు

Maharashtra Records 16620 Covid Cases
  • నిన్న 16,620 కొత్త కేసుల నమోదు
  • మహమ్మారి వల్ల 50 మంది మృతి
  • ప్రస్తుతం రాష్ట్రంలో 1,26,231 యాక్టివ్ కేసులు
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. వీటిలో సగంపైగా కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో ఏకంగా 16,620 కొత్త కేసులు నమోదయ్యాయి. 40 మంది మృత్యువాత పడ్డారు. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 23,14,413కి చేరుకుంది. ఇప్పటి వరకు 52,861 మంది చనిపోయారు. గత రెండు రోజులుగా మహారాష్ట్రలో 15 వేలకు మించి కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 92.21 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,26,231 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  

మరోవైపు మహారాష్ట్రలో కేసులు భారీగా పెరిగిపోతుండటంతో పొరుగు రాష్ట్రాలు ఆందోళనకు గురవుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక అలర్ట్ అయింది. సరిహద్దుల వద్ద కోవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ, మరో లాక్ డౌన్ విధించడమన్నది ప్రజల చేతుల్లోనే ఉందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అన్నారు.
Corona Virus
Maharashtra

More Telugu News