Junior NTR: హీరోగా ఎంట్రీ ఇస్తున్న జూనియర్ ఎన్టీఆర్ బావమరిది

Junior NTR brother in law to enter tollywood
  • ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ చంద్ర తెరంగేట్రం
  • నితిన్ చంద్రను పరిచయం చేస్తున్న తేజ
  • మరో 40 మంది కొత్త ఆర్టిస్టులు కూడా పరిచయం 
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ చంద్ర టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తారక్ భార్య లక్ష్మీప్రణతి తమ్ముడే నితిన్ చంద్ర కావడం గమనార్హం. ఉదయ్ కిరణ్, నితిన్ లాంటి హీరోలను వెండి తెరకు పరిచయం చేసిన దర్శకుడు తేజనే నితిన్ చంద్రను కూడా హీరోగా లాంచ్ చేస్తున్నారు. అయితే నితిన్ చంద్ర ఎంట్రీ వెనుక జూనియర్ ఎన్టీఆర్ ప్రోద్బలం ఎంత మేరకు ఉందనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కోసం నితిన్ చంద్ర నటనలో శిక్షణ తీసుకున్నాడు. తేజ తెరకెక్కిస్తున్న ఈ సినిమా 'చిత్రం' సినిమాకు సీక్వెల్ అని తెలుస్తోంది. ఈ చిత్రంలో నితిన్ చంద్రతో పాటు మరో 40 మంది కొత్త ఆర్టిస్టులు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

Junior NTR
Brother in law
Nitin Chandra
Tollywood

More Telugu News