: ఐదుగురు పర్వతారోహకుల గల్లంతు
ప్రపంచంలోనే ఎత్తయిన మూడవ పర్వత శిఖరం కాంచన్ జంగ ఎక్కుతూ ఐదుగురు పర్వతారోహకులు గల్లంతయ్యారు. సోమవారం నుంచి వీరి ఆచూకీ లేదని, ప్రతికూల వాతావరణం కారణంగా మరణించి ఉండవచ్చని నేపాల్ అధికారులు ప్రకటించారు. వారిని కాపాడేందుకు హెలికాప్టర్ పంపాలని చూసినప్పటికీ ప్రతికూల వాతావరణం కారణంగా వీలు పడలేదని తెలిపారు. 7,900 ఎత్తు నుంచి వారు పడిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.