Alexandr Kudlay: బంధం బలపడడం కోసం చేతులకు బేడీలు వేసుకున్న జంట

Ukraine couple ties their hands with handcuffs
  • విభేదాలతో విడిపోవాలనుకున్న యువతి
  • అభ్యంతరం చెప్పిన వ్యక్తి
  • సన్నిహితంగా ఉంటే కలతలు సమసిపోతాయని వివరణ
  • బేడీలు వేసుకుందామని ప్రతిపాదన
  • అంగీకరించిన యువతి
ఉక్రెయిన్ కు చెందిన అలెగ్జాండర్ కుడ్లే (33), విక్టోరియా పుస్తోవిటోవా (28) అనే జంట సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే వాళ్లిద్దరూ గత కొన్ని వారాలుగా చేతులకు బేడీలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. తమ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు వాళ్లు తమ చేతులకు బేడీలు వేసుకున్నారు. అలెగ్జాండర్ కుడ్లే ఆన్ లైన్ కార్ల అమ్మకందారు కాగా, విక్టోరియో ఓ బ్యూటీషియన్. అయితే ఇద్దరి మధ్య కలతలు రావడంతో విక్టోరియా విడిపోవడమే మంచిదని భావించింది.

కానీ, అలెగ్జాండర్ మాత్రం ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. అంతేకాదు, తమ మధ్య బంధం మరింత దృఢతరమయ్యేలా వినూత్న ప్రతిపాదన చేశాడు. ఇద్దరి చేతులను బేడీలతో బంధించి ప్రతి క్షణం సన్నిహితంగా ఉందామని, తద్వారా తమ మధ్య విభేదాలు దూరమవుతాయని తెలిపాడు. అతడి ఆలోచనకు విక్టోరియా అంగీకరించడంతో వాలంటైన్స్ డే నుంచి వీరి ప్రయోగాత్మక జీవనం ప్రారంభమైంది.

చేతులకు బేడీలతోనే వీరిద్దరూ సంయుక్తంగా అన్ని పనులు చేసుకోవడం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇన్ స్టాగ్రామ్ లో వీరు పోస్టు చేసే ఫొటోలకు విశేషమైన స్పందన లభిస్తోంది. కొద్దికాలంలోనే వీరికి మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు వచ్చిపడ్డారు. ఉక్రెయిన్ టెలివిజన్ చానల్ కూడా వీరి ప్రయోగాత్మక జీవనాన్ని ఓ టాక్ షోలో ప్రత్యేకంగా చూపించింది.

సోషల్ మీడియాలో వీరి ఫొటోలు చూసిన కొందరు లవ్లీ కపుల్ అని ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం చేతులకు బేడీలు వేసుకుని టాయిలెట్ కు ఎలా వెళతారు? అంటూ సందేహాలు లేవనెత్తుతున్నారు. కాగా, వారిద్దరూ రోజుల తరబడి బేడీలు వేసుకునే ఉండడంతో చేతులకు పుండ్లు కూడా అయ్యాయట!
Alexandr Kudlay
Viktoria Pustovitova
Handcuffs
Relation
Ukraine

More Telugu News