Kona Venkat: కొన్ని సాంకేతిక కారణాలతో 'రౌడీబేబీ' సినిమా టైటిల్ మార్చుతున్నాం: కోన వెంకట్

Kona Venkat told they changes Rowdy Baby title due to technical reasons
  • సందీప్ కిషన్, నేహాశెట్టి జంటగా 'రౌడీబేబీ' చిత్రం
  • మరో టైటిల్ ప్రకటిస్తామన్న కోన వెంకట్
  • దాంతోపాటే రిలీజ్ డేట్ కూడా వెల్లడిస్తామని వివరణ
  • 'రౌడీబేబీ'కి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న కోన
  • జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చిత్రం
సందీప్ కిషన్, నేహాశెట్టి జంటగా రూపొందుతున్న 'రౌడీ బేబీ' చిత్రం టైటిల్ మార్చుతున్నట్టు నిర్మాత కోన వెంకట్ వెల్లడించారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా టైటిల్ మార్పు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే, కొత్త టైటిల్ మరింత ఆసక్తికరంగా ఉండనుందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో వెల్లడించారు.

 "కొన్ని మార్పులు ఆహ్లాదకరంగా, ఎంతో బాగుంటాయి. మేం వెల్లడించబోయే ఉద్విగ్నభరితమైన కొత్త టైటిల్ కోసం వేచిచూడండి. దాంతోపాటే అప్ డేటెట్ లుక్, రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం" అని కోన వెంకట్ వివరించారు.

కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ బ్యానర్ పై ఎంవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, బాబీ సింహా కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
Kona Venkat
RowdyBaby
Title
Sandeep Kishan
Tollywood

More Telugu News