Gorantla Madhav: బాలకృష్ణ ఎప్పుడు ఎలా వుంటారో అర్థంగాక జనాలు బెంబేలెత్తిపోతున్నారు: ఎంపీ గోరంట్ల మాధవ్

Gorantlla Madhavs sensational comments on Balakrishna
  • రాష్ట్రంలో ఇక టీడీపీ పని అయిపోయింది   
  • బాలకృష్ణ పక్కన నిల్చోవడానికి కూడా భయపడుతున్నారు
  • ఆ అభిమానులంతా వైసీపీ వైపు చూస్తున్నారు  
చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేశ్ లపై హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని... చంద్రబాబు ముసలివాడు అయిపోయారని, ఆయన కొడుకు లోకేశ్ కి నోట మాట రాదని విమర్శించారు. పంక్చరైన సైకిల్ ను చంద్రబాబు వయోభారంతో తొక్కలేక తొక్కుతున్నారని అన్నారు.

బాలకృష్ణ రాత్రి ఫుల్ బాటిల్ కొడతారని, పగలు జనాలను కొడతారని మాధవ్ ఎద్దేవా చేశారు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో అర్థంకాక... హిందూపురం జనాలు బెంబేలెత్తిపోతున్నారని చెప్పారు. ఆయన పక్కన నిల్చోవడానికి కూడా వణికిపోతున్నారని అన్నారు. ఆయన చేత దెబ్బలు తిన్నవాళ్లు, బూతులు తిట్టించుకున్నవాళ్లు ఎంతోమంది ఉన్నారని చెప్పారు. ఓటేసిన పాపానికి శిక్షను అనుభవించడానికి అభిమానులు సిద్ధంగా లేరని... అందుకే వారంతా వైసీపీ వైపు చూస్తున్నారని అన్నారు.
Gorantla Madhav
YSRCP
Balakrishna
Chandrababu
Nara Lokesh
Telugudesam

More Telugu News