Shreyas Ayyar: అయ్యర్ హాఫ్ సెంచరీ... టీమిండియా 124/7

Shreyas Ayyar fifty helps India hundred plus score
  • అహ్మదాబాద్ లో భారత్, ఇంగ్లండ్ తొలి టీ20 మ్యాచ్
  • మొదట బ్యాటింగ్ చేసిన భారత్
  • 67 పరుగులు చేసిన అయ్యర్
  • ఆర్చర్ కు 3 వికెట్లు.. కోహ్లీ డకౌట్
అహ్మదాబాద్ లో ఇంగ్లండ్ తో తొలి టీ20 మ్యాచ్ లో భారత టాపార్డర్ బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. మిడిలార్డర్ లో శ్రేయాస్ అయ్యర్ 67 పరుగులతో రాణించాడు. పంత్ 21, పాండ్య 19 పరుగులు చేశారు. మొత్తమ్మీద 20 ఓవర్లలో టీమిండియా 7 వికెట్లు నష్టపోయి 124 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (1), శిఖర్ ధావన్ (4) శుభారంభం ఇవ్వలేకపోయారు. కెప్టెన్ కోహ్లీ డకౌట్ కావడంతో భారత్ 20 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది.

అయితే, పంత్, అయ్యర్ జోడీ దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది. పాండ్య కూడా ఓ మోస్తరుగా ఆడడంతో బారత్ కు ఆ మాత్రమైనా స్కోరు వచ్చింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ కు 3 వికెట్లు లభించగా... అదిల్ రషీద్, మార్క్ ఉడ్, క్రిస్ జోర్డాన్, బెన్ స్టోక్స్ తలో వికెట్ ఈశారు.
Shreyas Ayyar
India
England
1st T20

More Telugu News