Congress: పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ ప్రచార సారథులుగా 30 మంది.. జాబితా విడుదల

Congress announced star campaigners list for West Bengal elections
  • పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు
  • స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో హేమాహేమీలు
  • సోనియా, రాహుల్, మాజీ ప్రధాని మన్మోహన్ లకు చోటు
  • ఈ నెల 27 నుంచి పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు
  • ఏప్రిల్ 29 వరకు 8 విడతల్లో పోలింగ్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అధికార తృణమూల్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ ఉన్నప్పటికీ, పునర్ వైభవం అందుకోవాలని పరితపిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా పోరుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో 30 మందితో స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసింది. వీరిలో హేమాహేమీలున్నారు. ఏఐసీసీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు బెంగాల్ లో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు మోయనున్నారు. పశ్చిమ బెంగాల్ లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు మొత్తం 8 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఓట్ల లెక్కింపు చేపడతారు.
Congress
Star Campaigners
West Bengal
Assembly Elections
Sonia Gandhi
Rahul Gandhi

More Telugu News