Astrazeneca: ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ భేషుగ్గా ఉంది... నిలిపివేయడం ఎందుకు?: డబ్ల్యూహెచ్ఓ

WHO advocates for Astrazeneca corona vaccine use
  • కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా
  • పలు దేశాల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ నిలిపివేత
  • రక్తం గడ్డకడుతోందంటూ అపోహలు
  • ఎలాంటి ఆధారాలు లేవన్న డబ్ల్యూహెచ్ఓ
ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ను పలు దేశాలు నిలిపివేయడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పందించింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సమర్థవంతమైనదేనని, దాన్ని నిలిపివేయడం ఎందుకని ప్రశ్నించింది. తమ వ్యాక్సిన్ సలహా కమిటీ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ డేటాను విశ్లేషించిందని, వ్యాక్సిన్ కు, రక్తం గడ్డకట్టడానికి సంబంధం లేదని తేల్చిందని డబ్ల్యూహెచ్ఓ వివరించింది.  

రక్తం గడ్డకడుతోందన్న అపోహల నేపథ్యంలో అనేక దేశాలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పై విముఖత ప్రదర్శిస్తున్నాయి. డెన్మార్క్, నార్వే, ఐస్ లాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పంపిణీని నిలిపివేశాయి.

ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి మార్గరెట్ హారిస్ స్పందిస్తూ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అద్భుతమైనదని కితాబునిచ్చారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పంపిణీని తాము కొనసాగిస్తామని ఆమె వెల్లడించారు. భద్రతపరంగా సమర్థవంతమైన వ్యాక్సిన్లనే తాము అందిస్తామని, కానీ దీన్ని ఉపయోగించవద్దనడానికి ఎలాంటి కారణాలు కనిపించడంలేదని అన్నారు.
Astrazeneca
Corona Virus
Vaccine
WHO

More Telugu News