Corona Virus: కొత్త స్ట్రెయిన్ వల్ల బ్రెజిల్ లో పెరిగిన మరణాలు

  • బ్రెజిల్ లో నిన్న ఒక్క రోజే 2,286 మంది మృతి
  • అమెరికాను దాటేసిన బ్రెజిల్
  • ప్రతి 20 నిమిషాలకు వెయ్యి మందికి కరోనా
Corona deaths increased in Brazil due to new strain

బ్రెజిల్ ను కరోనా మహమ్మారి వణికిస్తోంది. నిన్న ఒక్క రోజే ఆ దేశంలో ఏకంగా 2,286 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఒకే రోజు ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే ప్రథమం. మరణాల విషయంలో అమెరికాను బ్రెజిల్ దాటేసింది. గత వారం రోజులుగా బ్రెజిల్ లో సగటున రోజుకు 1,573 మంది మృతి చెందుతుండగా... అమెరికాలో ఈ సంఖ్య 1,566గా ఉంది.

ప్రతిరోజు బ్రెజిల్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గత వారం డేటాను పరిశీలిస్తే... సగటున ప్రతి 20 నిమిషాలకు వెయ్యి మంది మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో, బ్రెజిల్ వైద్యాధికారులు మాట్లాడుతూ కొత్త స్ట్రెయిన్ కారణంగానే మరణాల సంఖ్య పెరిగిందని చెప్పారు. బ్రెజిల్ లో ఇప్పటి వరకు 1.12 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటి వరకు 2.70 మంది మృతి చెందారు.

More Telugu News