భారత్ లో ఐఫోన్ 12 అసెంబ్లింగ్ పనులను ప్రారంభించిన యాపిల్
- తమిళనాడులోని ప్లాంట్ లో అసెంబ్లింగ్ పనులు ప్రారంభం
- భారత కస్టమర్ల కోసం ఫోన్ల తయారీ
- భారత్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన యాపిల్
ఇక ఇక్కడ తయారవుతున్న ఫోన్లను భారతీయ కస్టమర్లకే అందించనున్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ అయిన ఇండియాపై యాపిల్ సంస్థ పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్ తార స్థాయికి చేరుకున్న నేపథ్యంలో... చైనా నుంచి తన కార్యకలాపాలను యాపిల్ క్రమంగా ఇతర దేశాలకు తరలిస్తోంది.