Brahmakumaris: బ్రహ్మకుమారీస్ అధ్యక్షురాలు హృదయ మోహిని కన్నుమూత

Brahmakumaris president Hirdaya Mohini dies
  • తుదిశ్వాస విడిచిన దాదీ హృదయ మోహిని
  • ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి  
  • హృదయ మోహిని వయసు 93 సంవత్సరాలు
ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్ అధ్యక్షురాలు దాదీ హృదయ మోహిని కన్నుమూశారు. ఆమె వయసు 93 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె... ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

2020 మార్చి 27న రాజయోగిని దాదీ జానకి కన్నుమూశారు. దీంతో, బ్రహ్మకుమారీస్ అధ్యక్షురాలిగా హృదయ మోహిని బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఢిల్లీ జోనల్ అధిపతిగా ఆమె పని చేశారు. అంతేకాదు, అన్ని ఖండాల్లో ఆధ్యాత్మికత, సాత్విక జీవనశైలి, రాజయోగ జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ఆమె విశేష కృషి చేశారు.
Brahmakumaris
Hirdaya Mohini
Dead

More Telugu News