సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- వెయిట్ తగ్గించుకునే పనిలో అనుష్క
- ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా అప్ డేట్
- మరో సినిమాలో 'మజిలీ' భామ
* ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని పూర్తిచేస్తున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ మే నెల నుంచి మొదలవుతుందని సమాచారం.
* ఆమధ్య నాగచైతన్య, సమంత జంటగా వచ్చిన 'మజిలీ' సినిమాలో బాలీవుడ్ భామ దివ్యాంష కౌశిక్ మరో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడీ ముద్దుగుమ్మ మరో తెలుగు సినిమాలో నటిస్తోంది. నాగశౌర్య హీరోగా రూపొందే 'పోలీసు వారి హెచ్చరిక' చిత్రంలో ఈ చిన్నది హీరోయిన్ గా నటిస్తుంది.