Acharya Movie: 'ఆచార్య' సినిమా షూటింగ్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన యూనిట్

Acharya completed a month long schedule in Rajahmundry and Illendu
  • ఎండల కారణంగా షూటింగ్ ను ఆపేశారనే వార్తలు
  • షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశామన్న యూనిట్
  • మే 13న విడుదల చేస్తున్నామని ప్రకటన
చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఆచార్య' చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. పూజ హెగ్డే, కాజల్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే, ఖమ్మం జిల్లాలో విపరీతమైన ఎండల కారణంగా షూటింగ్ ను అర్ధాంతరంగా ఆపేశారని... చిరంజీవి హైదరాబాదుకు చేరుకున్నారనే వార్త వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇల్లందు, రాజమండ్రిల్లోని షెడ్యూల్ ని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేశామని చెప్పారు. చిరంజీవి, చరణ్ లపై కీలక సన్నివేశాలను కొరటాల శివ చిత్రీకరించారని తెలిపారు. షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని హైదరాబాదులో అడుగుపెట్టామని చెప్పారు. మే 13న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నామని తెలిపారు.
Acharya Movie
Shooting
Tollywood
Chiranjeevi
Ramcharan

More Telugu News