Nikhil: షూటింగులో గాయపడ్డ హీరో నిఖిల్

Tollywood actor Nikhil injured in shooting
  • గుజరాత్ లో 'కార్తికేయ 2' సినిమా షూటింగ్ 
  • యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా యాక్సిడెంట్
  • నిఖిల్ కాలికి గాయం
టాలీవుడ్ హీరో నిఖిల్ ప్రమాదానికి గురయ్యాడు. నిఖిల్ హీరోగా 'కార్తికేయ 2' సినిమా షూటింగ్ ఇటీవలే పునఃప్రారంభమైంది. ప్రస్తుతం గుజరాత్ లో షూటింగ్ జరుగుతోంది. ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో నిఖిల్ కాలికి గాయం అయింది. ప్రమాదం జరగడంతో షూటింగ్ ను ఆపేశారు. కొన్ని రోజుల పాటు ఈ యాక్షన్ సన్నివేశాలకు నిఖిల్ దూరంగా ఉంటారని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం నిఖిల్ బాగానే ఉన్నారని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది.

'కార్తికేయ 2' చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
Nikhil
Tollywood
Injured

More Telugu News