విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నా: కేటీఆర్
- అవసరమైతే విశాఖకు వెళ్లి మద్దతు ప్రకటిస్తా
- రేపు తెలంగాణ జోలికి కూడా కేంద్రం వస్తుంది
- ఇక్కడి సంస్థలను కూడా ప్రైవేటు పరం చేస్తామంటారు
విశాఖ ప్లాంటు కోసం జరుగుతున్న పోరాటానికి మనం మద్దతు ప్రకటించకపోతే... రేపు మన దగ్గరకు కూడా వస్తారని... తెలంగాణలోని బీహెచ్ఈఎల్, సింగరేణి ఇలా అన్నింటినీ అమ్మేస్తారని కేటీఆర్ చెప్పారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలను ప్రైవేటు పరం చేస్తామని అంటారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రైవేటీకరణ చేసే విధంగా ప్రధాని మోదీ తీరు ఉందని విమర్శించారు. విశాఖ స్టీల్ ఉద్యమానికి తాము మద్దతిస్తామని... తెలంగాణ సంస్థలను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నిస్తే వారు కూడా తమతో కలిసి పోరాటానికి రావాలని కేటీఆర్ అన్నారు.