Oldest Woman: దేశంలోనే తొలిసారి.. కర్ణాటకలో శతాధిక వృద్ధురాలికి టీకా

103 Year Old Becomes Oldest Woman In India To Get Covid Vaccine
  • బెంగళూరు అపోలో ఆసుపత్రిలో 103 ఏళ్ల బామ్మకు టీకా
  • టీకా తీసుకున్న అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు
  • యూపీలోనూ అంతే వయసున్న వ్యక్తికి టీకా
దేశంలో కరోనా వ్యాక్సిన్ రెండో విడత పంపిణీ చురుగ్గా సాగుతోంది. ఈ దశలో 65 ఏళ్లు దాటిన వృద్ధులు, 45 ఏళ్లు దాటి కోమార్బిడిటీస్ వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకాలు వేస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా కర్ణాటకలో ఓ శతాధిక వృద్ధురాలికి వ్యాక్సిన్ ఇచ్చారు. రాజధాని బెంగళూరులోని అపోలో ఆసుపత్రిలో జె కామేశ్వరి అనే 103 ఏళ్ల బామ్మకు టీకా వేశారు. ఫలితంగా దేశంలోనే టీకా తీసుకున్న అత్యంత వృద్ధురాలిగా  ఆమె రికార్డులకెక్కారు.

అలాగే, నోయిడాకు చెందిన అంతే వయసున్న మరొకరికి కూడా నిన్న టీకా వేసినట్టు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని బుద్ధనగర్‌కు చెందిన మహాబీర్ ప్రసాద్ మహేశ్వరి యూపీలో టీకా తీసుకున్న వారిలో అత్యంత వృద్ధ వ్యక్తి గా రికార్డులెక్కారు. నిన్నటికి దేశవ్యాప్తంగా 2.40 కోట్ల మందికి కరోనా టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
Oldest Woman
Corona Vaccine
Bengaluru

More Telugu News