Mekapati Goutham Reddy: విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలకు మేము సిద్ధం: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

We are ready to resign to protect Vizag steel plant says Mekapati Goutham Reddy
  • వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధం
  • టీడీపీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోం
  • కేంద్రంపై అందరం కలిసి పోరాడాలి
వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ మంత్రులు విభిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాజీనామాల వల్ల ఒరిగేది ఏమీ లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు చెప్పిన సంగతి తెలిసిందే. రాజీనామాలు చేసినంత మాత్రాన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని ఆయన అన్నారు.

మరోవైపు మరో మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ దీనికి పూర్తిగా విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందంటే తాము రాజీనామాలకు సిద్ధమని చెప్పారు. రాజీనామాలు చేయడానికి వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వెనుకాడరని అన్నారు. ఈ అంశంపై టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ విషయంలో అందరం కేంద్రంపై కలిసి పోరాడి సాధించుకోవాలని చెప్పారు.
Mekapati Goutham Reddy
YSRCP
Vizag Steel Plant
telug

More Telugu News