Raghu Rama Krishna Raju: రిపబ్లిక్ టీవీ వార్తను తేలికగా కొట్టిపారేయలేం: రఘురామకృష్ణరాజు

Conspiracy is hatching behind Jagan says Raghu Rama Krishna Raju
  • జగన్ జైలుకెళ్తే సీఎం పదవిని దక్కించుకోవాలనుకుంటున్నారు
  • ఏ వెధవలు కుట్రలు చేస్తున్నారనే విషయంపై దృష్టి సారించాలి
  • అసలైన కపటధారిని పట్టుకోవాలి
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ జైలుకెళ్తే సీఎం పదవిని దక్కించుకోవడానికి కొందరు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రిపై కుట్ర చేసే అంత ధైర్యం ఎవరికైనా ఉంటుందని తాను భావించడం లేదని... అయితే, రిపబ్లిక్ టీవీ లాంటి సంస్థ ఆ వార్తను ప్రసారం చేసిందంటే... దాన్ని అంత తేలికగా కొట్టి పారేయలేమని అన్నారు.

ఎంతో కొంత నిజం లేకపోతే ఆ వార్త రాదని చెప్పారు. జగన్ వెనుక ఏ వెధవలు కుట్ర చేస్తున్నారనే విషయంపై దృష్టి సారించాలని.. ఆ నిజమైన కపటధారిని పట్టుకోవాలని సూచించారు. జగన్ ముందు చెక్క భజనలు చేస్తూ... ఆయన వెనుక గోతులు తీస్తున్నారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు.
Raghu Rama Krishna Raju
Jagan
YSRCP

More Telugu News