BJP: అంత‌ర్జాతీయ పురుషుల దినోత్స‌వాన్ని కూడా జ‌రుపుకోవాలి: బీజేపీ ఎంపీ సోనాల్ మాన్‌సింగ్

I demand that International Mens Day should also be celebrated BJP MP Sonal Mansingh in Rajya Sabha
  • అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వంపై రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ
  • త‌మ అభిప్రాయాలు తెలిపిన మ‌హిళా ఎంపీలు
  • పురుషుల దినోత్స‌వ అంశాన్ని లేవ‌నెత్తిన సోనాల్ మాన్‌సింగ్
అంత‌ర్జాతీయ పురుషుల దినోత్స‌వాన్ని కూడా జ‌రుపుకోవాల‌ని బీజేపీ ఎంపీ సోనాల్ మాన్‌సింగ్ అన్నారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ రోజు రాజ్య‌స‌భ‌లో ప‌లువురు మ‌హిళా ఎంపీలు మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా బీజేపీ ఎంపీ సోనాల్ మాన్‌సింగ్ పురుషుల గురించి ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచమంతా మ‌హిళా దినోత్సవాన్ని జ‌రుపుకుంటోంద‌ని, అలాంట‌ప్పుడు పురుషుల దినోత్స‌వాన్నీ జ‌రుపుకోవాల్సిన అవ‌సరం ఉంద‌ని ఆమె చెప్పారు. కాగా, శివసేన సభ్యురాలు ప్రియాంకా చ‌తుర్వేది మాట్లాడుతూ, పార్ల‌మెంటులో 50 శాతం మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేయాల‌ని అన్నారు.
BJP
womens day
Rajya Sabha

More Telugu News