Chandrababu: పుత్రశోకం నుంచి కోలుకునే మనోధైర్యాన్ని మాగంటికి ప్రసాదించాలని కోరుకుంటున్నాను: చ‌ంద్ర‌బాబు

chandrababu express condolence over MPs son demise
  • మాగంటి రాంజీ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు
  • ఉజ్వల రాజకీయ భవిష్యత్తు ఉంటుందనుకున్నాం
  • చాలా చిన్న వయసులో ఇలా  దూరమైపోవడం బాధాకరం
  • పార్టీకి తీరని లోటు
మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత‌ మాగంటి వెంకటేశ్వరరావు కుమారుడు మాగంటి రాంజీ (37) అనారోగ్య కార‌ణాల‌తో నిన్న‌ రాత్రి మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతి ప‌ట్ల టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సంతాపం తెలిపారు.

'మాగంటి రాంజీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో ఎంతో చురుకుగా పాల్గొంటూ ఉంటే.. ఉజ్వల రాజకీయ భవిష్యత్తు ఉంటుందనుకున్నాం. అలాంటిది చాలా చిన్న వయసులో ఇలా అర్థాంతరంగా అందరికీ దూరమైపోవడం బాధాకరం. పార్టీకి తీరని లోటు' అని చంద్ర‌బాబు చెప్పారు.

'పుత్రశోకం నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని మాగంటి వెంకటేశ్వరరావుగారికి ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను' అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు.
Chandrababu
Telugudesam

More Telugu News