రెండో పెళ్లి అంటూ వస్తున్న కథనాలపై మంచు మనోజ్ స్పందన
- మనోజ్ మరోసారి పెళ్లి చేసుకుంటున్నాడంటూ ప్రచారం
- పెళ్లి తేదీ, సమయం కూడా మీరే చెప్పేయండన్న మనోజ్
- పెళ్లి వార్తల్లో నిజంలేదని పరోక్షంగా చెప్పిన హీరో
- 2015లో ప్రణతి రెడ్డితో మనోజ్ వివాహం
- 2019లో విడాకులు మంజూరు
మోహన్ బాబు చిన్న కొడుకైన మనోజ్ 2015లో ప్రణతి రెడ్డిని పెళ్లాడారు. దురదృష్టవశాత్తు వారి వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. 2019లో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ప్రణతి రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేసుకుంటుండగా, మనోజ్ సినీ రంగంలో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు.