KTR: కేసీఆర్ అంటే లెక్కలేకుండా మాట్లాడుతున్నారు... వడ్డీతో పాటు చెల్లిస్తాం: కేటీఆర్

KTR targets opposition parties
  • టీఆర్ఎస్ విద్యార్థి విభాగం సమావేశానికి కేటీఆర్
  • కేసీఆర్ మౌనాన్ని తక్కువగా అంచనావేయొద్దని హితవు
  • కేసీఆర్ మాటతీరు తెలంగాణ మొత్తానికి తెలుసని వ్యాఖ 
  • సమయం వచ్చినప్పుడు సత్తా చూపిస్తారని ఉద్ఘాటన
తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం సమావేశం నిర్వహించగా, కేటీఆర్ హాజరై ప్రసంగించారు. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ప్రస్థానం మొదలైందని, సీఎంలనే హడలెత్తించిన పార్టీగా టీఆర్ఎస్ కు ఘనచరిత్ర ఉందని ఆయన అన్నారు. కేసీఆర్ అంటే కొందరు లెక్కలేకుండా మాట్లాడుతున్నారని, వారికి వడ్డీతో పాటు చెల్లిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ మౌనాన్ని ఎవరూ తక్కువగా అంచనా వేయొద్దని విపక్షాలను హెచ్చరించారు.

గోడకు వేలాడదీస్తే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుందని, సమయం వచ్చినప్పుడే దాని సత్తా ఏంటో తెలుస్తుందని అన్నారు. కేసీఆర్ మాట్లాడితే ఎలా ఉంటుందో తెలంగాణ మొత్తానికి తెలుసని కేటీఆర్ స్పష్టం చేశారు. వాట్సాప్ వర్సిటీలో బీజేపీ నేతలు అబద్ధాలు నేర్చుకుంటున్నారని, తాము నేర్చుకున్న అబద్ధాలను తిరిగి సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేస్తున్నారని విమర్శించారు.
KTR
KCR
TRS
Students Wing
Hyderabad
Telangana

More Telugu News