Singer Sunitha: తాటి కల్లు టేస్ట్ చూసిన సింగర్ సునీత

Singer Sunitha tastes Kallu
  • ఓ కార్యక్రమం కోసం సునీతను ఆహ్వానించిన టీవీ చానల్
  • హైదరాబాద్ శివార్లలోని రిసార్టులో షూటింగ్
  • గ్లాసులో కల్లు పోయించుకుని తాగిన సునీత, భార్గవి
ప్రముఖ సినీ గాయని సునీత ఇటీవలే రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వ్యాపారవేత్త రామ్ ను ఆమె పెళ్లాడారు. మరోవైపు కెరీర్ పరంగా ఆమె బిజీగా ఉన్నారు. తాజాగా 'ప్రపంచ మహిళా దినోత్సవం' సందర్భంగా ఒక టీవీ చానల్ వాళ్లు ఓ ప్రత్యేక కార్యక్రమం కోసం ఆమెను ఆహ్వానించారు. హైదరాబాద్ శివార్లలోని ఓ రిసార్టులో ఆ కార్యక్రమం జరగింది. అక్కడ షూటింగ్ జరుగుతున్న సమయంలో గీత కార్మికులు తాటి కల్లును తీస్తున్నారు. దీంతో సునీతతో పాటు యాంకర్ భార్గవి తదితరులు సరదాగా కల్లు టేస్ట్ చూశారు. గ్లాసుల్లో కల్లు పోయించుకుని తాగారు. వీరు కల్లు తాగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Singer Sunitha
Anchor Bhargavi
Tollywood
Kallu

More Telugu News