టీఎంసీ అభ్యర్థుల తొలిజాబితా విడుదల... నందిగ్రామ్ నుంచి అసెంబ్లీ బరిలో మమతా బెనర్జీ
- పశ్చిమ బెంగాల్ లో మార్చి 27 నుంచి అసెంబ్లీ ఎన్నికలు
- ఏప్రిల్ 29 వరకు 8 విడతల్లో పోలింగ్
- 291 మందితో తొలి జాబితా విడుదల చేసిన మమత
- మార్చి 11న నందిగ్రామ్ నుంచి నామినేషన్!
- నందిగ్రామ్ లో మమతా వర్సెస్ సువేందు
కాగా, తొలి జాబితాలో 50 మంది మహిళలకు, 42 మంది ముస్లింలు, 79 మంది ఎస్సీలకు టీఎంసీ టికెట్లు ఇచ్చింది. 80 ఏళ్లకు పైబడిన వారికి మమత టికెట్ నిరాకరించారు. ఉత్తర బెంగాల్ లోని మూడు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయలేదు. పశ్చిమ బెంగాల్ లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు 8 విడతలుగా పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 11న సీఎం మమతా బెనర్జీ నామినేషన్ వేయనున్నారు.