Revanth Reddy: ఢిల్లీ నుంచి మొదలైన బీజేపీ పతనం గల్లీ దాకా కొనసాగడం ఖాయం: రేవంత్‌ రెడ్డి

revanth reddy fires on bjp
  • ఢిల్లీ మునిసిపల్ ఎన్నిక‌ల్లో ఒక్క సీటూ గెల‌వ‌ని బీజేపీ
  • ‌నేడు ఢిల్లీలో బీజేపీ ఓటమి
  • ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు అది తొలి సంకేతం
త్వ‌ర‌లో దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బీజేపీ ఓడిపోతుంద‌ని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఢిల్లీలోని ఐదు మునిసిపల్‌ కార్పొరేషన్‌ వార్డులకు ఫిబ్రవరి 28న జరిగిన ఉప ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ నాలుగింటిని గెలుచుకుంద‌ని, కాంగ్రెస్‌ ఒక స్థానంలో విజ‌యం సాధించింద‌ని వ‌చ్చిన ఓ వార్త‌ను రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు.

దీనిపై రేవంత్ స్పందిస్తూ, ఢిల్లీ నుంచి మొదలైన బీజేపీ పతనం గల్లీ దాకా కొనసాగడం ఖాయం. నేడు ఢిల్లీలో బీజేపీ ఓటమి రేపటి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు తొలి సంకేతం. అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
Revanth Reddy
Congress
Telangana
New Delhi

More Telugu News