CPI Narayana: విశాఖలో స్వరూపానందను కలిసిన సీపీఐ నారాయణ... ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ

CPI Narayana met Swami Swaroopanandendra in Visakha Saharada Peetham
  • విశాఖలో నారాయణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం
  • తమ అభ్యర్థితో కలిసి శారదా పీఠం సందర్శన
  • నారాయణకు సాదర స్వాగతం పలికిన స్వరూపానంద
  • తమ అభ్యర్థిని గెలిపించాలని కోరిన నారాయణ
  • మీరంటే నాకెంతో అభిమానం అన్న స్వామీజీ
  • నారాయణకు శాలువా కప్పి సత్కారం

సాధారణంగా కమ్యూనిస్టులు ఆధ్యాత్మికతకు ఆమడ దూరంలో ఉంటారు. అలాంటివారు స్వామీజీలను కలవడం చాలా అరుదు. అలాంటి అరుదైన ఘటనే విశాఖలో జరిగింది. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. తమ అభ్యర్థి పోటీ చేస్తున్న వార్డు పరిధిలోనే ఆశ్రమం ఉండడంతో నారాయణ.. స్వరూపానందేంద్రను కలిసి చర్చించారు.

అభ్యర్థితో సహా తన ఆశ్రమానికి విచ్చేసిన వామపక్ష నేతకు స్వరూపానంద ఘనసత్కారం చేశారు. శాలువా కప్పి దీవెనలు అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య సంభాషణ ఆసక్తిగొలిపేలా ఉంది. 'స్వామీ, మిమ్మల్ని కలిసిన వారిని గెలిపిస్తారట కదా?' అని నారాయణ ప్రశ్నించారు. ఇప్పుడు మీరు మా అభ్యర్థిని కూడా గెలిపించాలని అని కోరారు.

స్వరూపానంద స్పందిస్తూ... నారాయణపై తన అభిమానాన్ని చాటారు. మీరంటే నాకు చాలా గౌరవం... ఆశ్రమానికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కాగా, శారదా పీఠానికి వెళ్లడంపై ఆ తర్వాత నారాయణ వివరణ ఇస్తూ, ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News