సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- పవన్ సినిమా నుంచి సాయిపల్లవి అవుట్
- హైదరాబాదీ అమ్మాయిగా కృతి శెట్టి
- 'పుష్ప'లో లేనంటున్న అనసూయ
* సుధీర్ బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' పేరిట ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతోంది. ఇందులో కథానాయిక కృతిశెట్టి తెలంగాణ యాసలో మాట్లాడే హైదరాబాదీ అమ్మాయిగా నటిస్తోందట.
* అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' సినిమాలో హాట్ యాంకర్ అనసూయ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదనీ, తనకు పుష్ప నుంచి ఎటువంటి ఆఫర్ రాలేదనీ అనసూయ తాజాగా క్లారిటీ ఇచ్చింది.