Andhra Pradesh: అనంతపురం జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. బీరు తాగుతూ డ్రైవింగ్, నలుగురి మృతి

Road Accident in Anantapur dist 4 dead
  • కియా కార్ల పరిశ్రమ వద్ద ప్రమాదం
  • మృతుల్లో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు
  • మద్యం మత్తే ప్రమాదానికి కారణమని తేల్చిన పోలీసులు
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి సమీపంలో గత అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.  బెంగళూరువైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు కియా కంపెనీ ప్రధాన గేట్ వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో కారులో ఉన్న వారిలో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు. మృతులను బెంగళూరుకు చెందిన మనోజ్ మిట్టల్, ఢిల్లీకి చెందిన మరో యువకుడిగా గుర్తించారు. యువతులను గుర్తించాల్సి ఉంది.

కారు డ్రైవర్ బీరు తాగుతూ డ్రైవ్ చేస్తుండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh
Anantapur District
Road Accident

More Telugu News