Nitish Kumar: ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా కరోనా వ్యాక్సిన్: నితీశ్ కుమార్

Nitish kumar offers Corona vaccine at free of cost in private hospitals
  • 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం
  • ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ వేయించుకునే వాళ్లు రూ. 250 చెల్లించాలి
  • ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఫ్రీగా వ్యాక్సిన్ అని ప్రకటించిన నితీశ్
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. తొలి విడతలో కోవిడ్ వారియర్లకు మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. 60 ఏళ్లకు పైబడిన వారందరికీ ఈరోజు నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ను ఉచితంగా వేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునే వాళ్లు మాత్రం రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది.

మరోవైపు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందరికీ వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తామని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామని.... ఆసుపత్రులకు రూ. 250 చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. బీహార్ ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్ర ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తామని నితీశ్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఆయన తాజా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, నితీశ్ నిర్ణయం పట్ల బీహార్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Nitish Kumar
Corona Virus
Vaccine
Free

More Telugu News