Pawan Kalyan: బిగ్ బాస్ ఫేమ్ హిమజకు లేఖ రాసిన పవన్ కల్యాణ్

Pawan Kalyan writes letter to Pawan Kalyan
  • బిగ్ బాస్ తర్వాత హిమజకు పలు సినీ అవకాశాలు 
  • పవన్ చిత్రంలో కూడా ఆఫర్ 
  • ఉన్నత స్థాయికి వెళ్లాలంటూ పవన్ లేఖ

బిగ్ బాస్ ఫేమ్ హిమజకు వరుసగా సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా హిమజకు అవకాశం దక్కింది. పవన్ చిత్రంలో అవకాశం రావడంతో హిమజ ఆనందంలో మునిగి పోయింది. తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, పవన్ తో ఇటీవల దిగిన ఫొటోలను ఇన్స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

తాజాగా హిమజకు పవన్ కల్యాణ్ లేఖ రాశారు. 'హిమజ గారికి, మీకు అన్నీ శుభాలు జరగాలని, ప్రొఫెషనల్ గా ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటూ... పవన్ కల్యాణ్' అంటూ ఓ లేఖను హిమజకు ఆయన పంపించారు. ఈ లేఖను కూడా హిమజ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

పవన్ నుంచి లేఖ రావడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. తన ఆనందాన్ని మాటల్లోనూ, ఎమోజీల్లోనూ చెప్పలేకపోతున్నానని పేర్కొంది. మరోవైపు పవన్, క్రిష్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను శివరాత్రి సందర్భంగా విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News